లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అవసరమైన అన్ని మౌలిక వసతులను, భోజన వసతిని ఏర్పాటు చేయాలి : మంత్రి అచ్చెం నాయుడు

లీడర్ భాస్కర్ న్యూస్ ( తణుకు )  తణుకు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో జిల్లాలో అధిక వర్షాలు వలన నష్టపోయిన వరి పంట, గోదావరి వరద ఉధృతి చేపట్టాల్సిన చర్యలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో మంత్రుల బృందం సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెంనాయుడు మాట్లాడుతూ  భారీ వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్నందున అధికారులందరూ అప్రమత్తతో ఉండాలన్నారు. ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తుందని స్పష్టం చేశారు. లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అవసరమైన అన్ని మౌలిక వసతులను, భోజన వసతిని ఏర్పాటు చేయాలని, ఆశ్రయం పొందిన వారు నుండి ఏ విధమైన ఫిర్యాదు వచ్చిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బయో టాయిలెట్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ వర్షాల వలన పునరావసు కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు, ఇళ్లల్లోనికి మీరు చేరిన కుటుంబాలకు 3000 రూపాయలు చొప్పున అందజేయడం జరుగు చున్నదన్నారు. అలాగే వరద తాకిడికి గురైన ప్రాంతాలవాసులకు 25 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *