లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి ) సమస్యలు, వినతి పత్రాలతో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం ముందు సామాన్య ప్రజలు క్యూలు కడుతున్నారు. సమస్య విన్న వెను, వెంటనే పరిస్కారం మార్గం చూపిస్తున్న ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రోజు, రోజుకి ప్రజలు మరింత నమ్మకం పెంచుకుంటున్నారు. అధికారం చేపట్టక ముందే “జనవాణి ” కార్యక్రమాన్ని నిర్వహించిన పవన్ కళ్యాణ్ పై అప్పటి అధికార పార్టీ నాయకులు ఎన్నో విమర్శలు చేశారు. అవన్నీ పవన్ పట్టించుకోకుండా “జనవాణి ” కార్యక్రమానికి పవన్ ముందుకు తీసుకెళ్లారు. తద్వారా వచ్చిన అర్జీలను ఆయనే స్వయంగా పరిశీలించి ఆ సంబంధిత శాఖా అధికారులకు పంపించి పరిష్కార దిశగా పంపించేవారు. అధికారం వచ్చి ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన వెను, వెంటనే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి సమస్యలు తెలియజేయడానికి వస్తున్న సామాన్య ప్రజలతో ఆయనే స్వయంగా మాట్లాడి వారి సమస్యకి పరిస్కార మార్గం చూపిస్తున్నారు. దీంతో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయానికి ప్రజలు క్యూలు కడుతున్నారు.
జనసేన పార్టీ కార్యాలయానికి క్యూలు కడుతున్న సామాన్య ప్రజలు… సమస్యలపై స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…!
28
Jul