స్థానికంగా ఉన్న ఉచిత ఇసుక ఇవ్వాలంటూ ధర్నా..

లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు )కొవ్వూరు గోదావరి ఇసుకను, స్థానిక వాగులలో ఇసుకను తోలుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కే వి రమణ డిమాండ్ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నామని అన్ని ప్రాంతాల నుంచి ఇసుక తీసుకు వెళ్ళవచ్చని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రకటించారు. కానీ  జంగారెడ్డిగూడెంలో ముఖ్యమంత్రి  ప్రకటనకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ శ్రీ బాలాజీ తాపీ మేస్త్రి పనివాళ్ల సంక్షేమ సంఘం ట్రాక్టర్ డ్రైవర్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐ ఎఫ్ టి యు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీవో గారి కార్యాలయం ముందు ధర్నా చేసి ఆఫిస్ ఏవో ఎం సోమేశ్వర రావు గారికి వినతిపత్రం అందజేశారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *