లీడర్ భాస్కర్ న్యూస్ (అత్తిలి) కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి పోషణ్ పథకంలో భాగంగా పాఠశాల పిల్లలకు రోజు వారి భోజనంకి అదనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు (తిథి భోజనం) శుభభోజనం కార్యక్రమాన్ని సోమవారం అత్తిలి మండలం పాలి గ్రామంలో Zp, ఎంపీపీ స్కూల్ లో ఉపాధ్యాయులు నిర్వహించినారు. స్థాపన దినోత్సవం, జాతీయ నాయకులు పుట్టినరోజులు, ఉపాధ్యాయుల పుట్టినరోజులు వంటి ఏదైనా ముఖ్యమైన రోజులలో పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక పోషణం కొరకు వారి శక్తి కొలది 1 ఐటెమ్ అందించాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి పౌర సమాజ సంస్థలు,దాతలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామి చేయాలని జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి కోరారు.
‘తిధి భోజనం’ లో ప్రజలు భాగస్వామ్యం కావాలి – కొవ్వూరి వెంకట రెడ్డి
30
Jul