పారిశుద్యంపై మున్సిపల్ సిబ్బందితో ఎమ్మెల్యే ఆరిమిల్లి సమావేశం..

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) వర్షా కాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే తణుకు మున్సిపల్ సిబ్బందితో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశంలో పట్టణంలోని పారిశుధ్యం గురించి చర్చించారు. ఎక్కడా చెత్త నిల్వలు లేకుండా చేయాలన్నారు. తరుచుగా డ్రైనేజీలు సీల్డ్ తీయడం ద్వారా దోమలు అరికట్టడం జరుగుతుందన్నారు.వార్డుల్లో ఎక్కడైనా గుంతలు ఉన్న ప్రాంతంలో మురుగునీరు నిల్వ లేకుండా చేయాలని, బ్లీచింగ్ చల్లించాలని, పారిశుద్య పరిశుభ్రతతోనే ప్రజలను సీజనల్ వ్యాధులు భారీ నుండి కాపాడగలం అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *