లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) మాజీ శాసన మండలి చైర్మన్ ఎమ్. ఏ షరీఫ్ తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ గత అయిదేళ్ళలో రాధాకృష్ణ లేని లోటు తణుకు ప్రజలు తెలుసుకొని అఖండ మెజారిటి తో గెలిపించారన్నారు.
గతంలో దుర్మార్గపు పాలన సాగిందని మాన, ప్రాణ , ఆస్తులను హరించి పరిపాలన సాగించారని, అందుకే రాష్ట్రంలో NDA బలపరిచిన ముస్లీంలు ఉన్న ప్రతిచోట గెలిచారని, ముస్లింలలో పేదరికాన్ని తగ్గించేందుకు చంద్రబాబు ఎల్లప్పుడూ కృషి చేస్తారని అన్నారు. మళ్ళీ రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అయన తెలిపారు.