లీడర్ భాస్కర్ న్యూస్ (పాలకొల్లు ) యలమంచిలి మండలంలో వరద ముంపుకు గురైన బాడవ గ్రామంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. గ్రామాన్ని వరద నీరు దిగ్బంధం చేయడంతో ట్రాక్టర్ ఫై చేరుకుని నాలుగైదు అడుగుల నీటిలోనే తిరిగారు. అక్కడ వరద బాధితులను పరామర్శించి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సాయంగా 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు, కాయగూరలు అందజేశారు. ఇళ్లల్లోకి పూర్తిగా వరద నీరు చేరిన బాధిత కుటుంబాలకు మూడు వేలు నగదు పంపిణీ చేశారు.
భాడవ గ్రామంలో వరద నీటిలోనే ప్రజలను పరామర్శించి, వారికి నగదు, నిత్యావసరాలు అందజేసిన మంత్రి నిమ్మల…
31
Jul