వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో కొణిదల నిహారిక సందడి…

వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో కొణిదల నిహారిక సందడి…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) TP గూడెం    మండలం పెద్ద తాడేపల్లి వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో మెగా డాటర్ శుక్రవారం కొణిదల నిహారిక సందడి చేశారు.ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులతో సావిత్రి పేటకు చెందిన ఈద్ వంశీ దర్శకత్వంలో నిర్మితమైన చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి నిహారిక హాజరయ్యారు. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో యువత ప్రాధాన్యత చిత్రాన్ని తాను స్వయంగా నిర్మిస్తున్నట్టు నిహారిక పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమకు సహకరించి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాన్ని, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నా కూతురితో సమానమైన నిహారిక నిర్మాణ సారధ్యం వహించి తాడేపల్లిగూడెం వారికి ఛాన్స్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఇది  మెగా ఫ్యామిలీ తాడేపల్లిగూడెంకి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *