లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం) కృషి పట్టుదల ఉంటే అవరోధాలు ఎన్ని ఉన్నా విజయం సాధ్యమని కొయ్యే చిట్టి రాజు నిరూపించారని శాసన మండలి సభ్యులు వంక రవీంద్ర నాథ్ తెలిపారు. భీమవరం లోని శాసన మండలి స్పీకర్ మోషన్ రాజు నివాసంలో రవీంద్ర నాథ్ , చిట్టి రాజు కు సహచర మండలి సభ్యులు జయమంగళం వెంకట రమణ కౌలు శ్రీనివాస్ తో కలసి అభినందనలు తెలియజేసారు. యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ మీద ఉన్న మక్కువతో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి , మూడు ప్రయత్నాల్లో విఫలం ఐనా , మొక్కవోని పట్టుదలతో ఇండియన్ పోలీస్ సర్వీసెస్ సాధిచడం చూసి నేటి యువతరం ఇన్స్పిరేషన్ పొందాలని రవీంద్రనాథ్ తెలియజేసారు .
కృషి , పట్టుదల ఉంటే విజయం సాధ్యం – MLC వంక రవీంద్రనాధ్
02
Aug