లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లిగూడెం) బలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, నియోజకవర్గంతో పాటు రాష్ట్ర మొత్తం సుభిక్షంగా ఉండాలని, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. గ్రామదేత బలుసులమ్మ అమ్మవారికి శనివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆషాడం సారె అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో అమ్మవారికి జాతర చేసిన సందర్భంలో తాను మున్సిపల్ చైర్మన్ గా ఉండడం అదృష్టమన్నారు. అమ్మవారికివచ్చే సంవత్సరం జాతర చేయాలని నిర్ణయించామన్నారు. పట్టణ ప్రజలు కూడా వచ్చే ఏడాది జాతర చేసేందుకు సమాయత్తం కావాలని పెళ్లిళ్లు వంటి శుభ కార్యక్రమాలకు ప్రణాళిక వేసుకోవాలన్నారు. ముందుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, సతీమణి అనురాధ, కుమారుడు బొలిశెట్టి రాజేష్ కూటమి నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి –ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
03
Aug