రాత్రి వరకు..ప్రజా సమస్యలను ఆలకించిన మంత్రి రామానాయుడు
లీడర్ డిజిటల్ న్యూస్ (పాలకొల్లు)శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆయన కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలతో గడిపారు. ప్రజల నుంచి సమస్యలు ఆలకిస్తూ పరిష్కారానికి కొన్నింటికి అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు ఇచ్చారు. మరి కొన్నింటికి సానుకూలంగా చూస్తానంటూ హామీ ఇచ్చారు . కొందరు వినతుల ద్వారా సమస్యలను దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.