* రైతులకు సబ్సిడీతో విత్తనాలు అందజేసిన MLA రాధాకృష్ణ
లీడర్ భాస్కర్ న్యూస్ (ఇరగవరం) ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు పంటపొలాలన్నీ పూర్తిగా మునిగిపోయి దెబ్బతిన్న రైతులందరికీ ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండలం కేతావారిపాలెంలో పంట దెబ్బతిన్న రైతులకు సబ్సిడీ విత్తనాలను అందజేశారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అన్ని గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలు నష్టం అంచనాలు వేయడం జరిగిందని, ఊడుపు అయిన దశ నుండి నెల రోజులు పంట నష్టపోయిన రైతాంగానికి సబ్సిడీపై విత్తనాలను అందజేయడం జరిగిందన్నారు.అంతేకాకుండా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి నష్ట పరిహారం కూడా అందజేస్తామన్నారు.