లీడర్ భాస్కర్ న్యూస్ (మంగళగిరి) జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు అందరికీ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు. మంగళగిరితో ముడిపడిన బంధం తనని చేనేత కుటుంబసభ్యుడిని చేసిందన్నారు.చేనేత కళాకారుల కష్టాలు చూశానని, సమస్యలపై పూర్తి అవగాహన వచ్చిందన్నారు. యువగళం పాదయాత్రలో చేనేత రంగం లక్షలాది మంది జీవనానికి ఉపయోగపడటమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే ఓ కళ అని పూర్తిస్థాయి అవగాహన కలిగిందన్నారు. చేనేతరంగానికి పూర్వవైభవం తీసుకొస్తామని పాదయాత్రలోనే మాటిచ్చాను. సమాంతరంగా మన మంగళగిరిలో చేనేతలకు చేయూతనందించే వివర్స్ శాల పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి టాటా తనేరా సంస్థ తో అనుసంధానం చేసానన్నారు. పేద చేనేత కళాకారులకు మగ్గాలు, ఇతర సామాగ్రి అందించానని, చేనేత రంగం, కార్మికుల సమస్యలన్నీ శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఓ ప్రణాళిక రూపొందిస్తోందన్నారు. మన మంగళగిరి-మన చేనేత అనే నినాదంతో దేశవ్యాప్తంగా మన చేనేత వస్త్రాలకు బ్రాండింగ్ కల్పిస్తున్నాం. చేనేత కళకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, తనని ఆదరించి, ఆశీర్వదించిన చేనేత కుటుంబసభ్యులందరికీ చేనేత దినోత్సవం సందర్భంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేశారు.
చేనేత కళకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా – మంత్రి నారా లోకేష్
07
Aug