లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) ప్రతీ ఒక్కరూ చేనేత దుస్తులు ధరించి ఆ రంగానికి ప్రోత్సాహం అందజేయాలని తణుకు నియోజకవర్గ బిజెపి కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి పేర్కొన్నారు.భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో చేనేత ప్రధాన భూమిక పోషించిందన్నారు. చేనేత రంగానికి గౌరవమిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ 2015 వ సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం గా ప్రకటించరన్నారు. ఈ సందర్భంగా బుధవారం చేనేత వస్త్రాలను స్థానిక నరేంద్ర సెంటర్ వద్ద ఉన్న చేనేత వస్త్రాలయంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి,పట్టణ ఉపాధ్యక్షులు రాసాబత్తుల అనుకుమార్ ,పట్టణ ప్రధానకార్యదర్శి బొల్లాడ నాగరాజలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసారు. ప్రతీ ఒక్కరూ చేనేత వస్త్రాలును కొనుగోలు చేసి, చేనేత రంగానికి ప్రోత్సహించవలసినదిగా వారు కోరారు. అనంతరం 1963 నుండి చేనేత వస్త్రాలు అమ్మకాలు చేస్తున్న గాదె శ్రీనివాసు,నాగమణి(మాలతి) దంపతులకు శాలువా కప్పి , పూలు పండ్లు తో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కిరణ్మయి, తణుకు పట్టణ బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చేనేతను ప్రోత్సహించాలి – బిజెపి కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి
07
Aug