క్రిమినల్ కొత్త చట్టాలను నిలుపుదల చేయాలని న్యాయవాదులు డిమాండ్..

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తున్న నూతన క్రిమినల్ చట్టాలను నిలుపుదల చేయాలని గురువారం నాడు ఆలిండియా లాయర్స్ యూనియన్ ,తణుకు బార్ అసోసియేషన్, ప్రజా సంఘాలు,ఆధ్వర్యంలో గురువారం నాడు తణుకు మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ కు మెమొరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలిండియా లాయర్స్ యూనియన్ ఉభయ జిల్లాల ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ కరోనా సమయములో న్యాయవాదులతో గాని మేధావులతో గాని కొత్త చట్టాలపై చర్చలు జరపకుండా పార్లమెంట్లో 142 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి ఆమోదించిన చీకటి చుట్టాలని అన్నారు. ప్రజల యొక్క స్వేచ్ఛ వాక్కు స్వాతంత్ర హక్కులను హరించే చట్టాలని అన్నారు.CITU జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్  మాట్లాడుతూ ప్రజలకు అనుగుణమైనవి ప్రజా జీవన విధానంతో ముడిపడిన చట్టాలను పాలకులు అమలు జరపాలని దుర్మార్గమైన చట్టాలను అమలు చేయరాదని అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *