ఆదివాసులు ప్రస్తుత సమాజ మూలాలు – MLC వంక రవీంద్రనాధ్

లీడర్ భాస్కర్ న్యూస్(రాజమండ్రి )ఆదివాసులు ప్రస్తుత సమాజ మూలాలని, అప్పటి నుండి పురాతన సంప్రదాయాలలో కట్టుబడి , ఆ సంస్కృతిని కొనసాగిస్తున్నారని , వారికి తగిన గౌరవం సౌకర్యాలు కలుగచేయవలసిన భాద్యత ప్రభుత్వం  నగర పౌరులపై ఉందని శాసన మండలి సభ్యులు వంక రవీంద్ర నాథ్ అన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ ప్రాగణంలో జరిగిన ‘ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ’ కార్యక్రమంలో రవీంద్రనాథ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ ‘ వందన వికాస్ యోజన ‘ పధకాన్ని మన రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగించుకోవాలని , తద్వారా 300 మంది గిరిజనులు ఒక గ్రూప్ గా ఏర్పడితే 15 లక్షల గ్రాంట్ పొందగలరన్నారు. ఈ మొత్తాన్ని గిరిజనులు వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా సంగ్రహణ , విశ్లేషణ , ప్యాకింగ్ మార్కెటింగ్ కోసం ఉపయోగించుకోవచ్చని రవీంద్ర నాథ్ తెలిపారు . ఏజెన్సీ ప్రాతంలో శిశు మరణాలు దేశ సగుటతో పోలిస్తే 63 శాతం అధికంగా ఉన్నాయని , వారికి తగిన వైద్య సౌకర్యాలు కల్పిచాలని వంక రవీంద్ర కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *