లీడర్ భాస్కర్ న్యూస్ (మండపేట) ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కొన సత్యనారాయణ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు మూడు రంగుల జెండా ఎగురవేయాలని కోరారు. తొమ్మిదో తేదీ నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరు జాతీయ జెండా ఇంటిపై ఎగురవేయాలని అన్నారు. మండపేట పట్టణంలో హర్ ఘర్ తిరంగా ఇంచార్జ్ కంకటాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో మండపేట మెయిన్ రోడ్ లో తోపుడుబండ్లకు, షాపుల వద్ద, ఆటోలకు, చర్మకారుల షాపులు వద్ద జాతీయ జెండాలను పంపిణీ చేశారు . కలవపువ్వు సెంటర్ వద్ద నూతన వధూవరులకు జెండాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ,కిసాన్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వల్లభనేని రవీంద్రబాబు, పట్టణ అధ్యక్షులు మద్దుల సుబ్బారావు, రావూరి బాబురావు రామానుజన్ మాస్టారు విశ్వహిందూ పరిషత్ రుద్ర శర్మ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటి పై మువ్వన్నెల జెండా … బిజెపి ఆధ్వర్యంలో ఆజాదికా- అమృత్ మహోత్సవ్…
10
Aug