లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల మూడు నెలలు వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు కోనాల భీమారావు కోరారు.శనివారం తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.అరుణకు యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ మూడు నెలలు వేతన బకాయిలతో పాటు ఈఏడాది జనవరి నుంచి పి.ఎఫ్ సొమ్ము కార్మికుల ఖాతాల్లో జమ చేయవలసి వుందన్నారు.తక్షణమే వేతన బకాయిలు,పి.ఎఫ్ సొమ్ము జమ చేయాలని భీమారావు డిమాండ్ చేశారు.అలాగే తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి కనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాలని కోరారు. మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు ఎన్.చింతాలు,డి.చిన్నా, డి.లక్ష్మణరావు,ఎం.బేబి,ఎం.వెంకటలక్ష్మి, ఎన్.లక్ష్మి,డి.ప్రసన్నకుమారి,ఇ.హైమావతి,యు.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు,పి.ఎఫ్ బకాయిలు తక్షణమే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలి – కొనాల భీమారావు
10
Aug