లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) ఏపీ సీడ్స్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారానికి సంఘటిత పోరాటాలకు సమాయత్తం కావాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, ఏపీ సీడ్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపు నిచ్చారు.ఆదివారం తణుకు కామ్రేడ్ వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు ఏపీ సీడ్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ సర్వసభ్యసమావేశం నిర్వహించారు.సమావేశానికి భీమారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని విస్మరించి కార్పోరేట్ వర్గాలకు మేలు చేయడమే ధ్యేయంగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే రీతిలో నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చిందన్నారు.కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు.కార్మికుల సమస్యలు పరిష్కారం హక్కుల సాధనకు సంఘటిత పోరాటాలే శరణ్యమన్నారు.
*ఏపీ సీడ్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ నూతన కమిటీ ఎన్నిక…*
అనంతరం ఏపీ సీడ్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షునిగా కోనాల భీమారావు, కార్యదర్శిగా సావారపు దేవీ, కోశాధికారిగా పిండి సత్యవతి,ఉపాధ్యక్షునిగా పితాని పెద్దిరాజు, సహాయ కార్యదర్శిగా వలవల అరుణకుమారి, కమిటీ సభ్యులుగా జగన్నాధం ప్రభావతి, అడపా లక్ష్మీ,మెట్టా రాము,సెపేను రాము ఎన్నికయ్యారు.