జగన్ విధ్వంసం నక్కల అవుట్ ఫాల్స్ స్లూయిస్ లోనూ కనిపిస్తుంది – మంత్రి రామానాయుడు

లీడర్ భాస్కర్ న్యూస్ (పాలకొల్లు ) జగన్ ఐదేళ్ల పాలనలో విధ్వంసం పోలవరం, అమరావతి లోనే కాదని నక్కల అవుట్ ఫాల్స్ స్లూయిస్ లోను కనిపిస్తుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన యలమంచిలి మండలం లక్ష్మీ పాలెం నక్కల డ్రైన్ అవుట్ ఫాల్స్ స్లుయిస్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం లో డ్రైన్లు, కాలువలపై లాకులు, తలుపుల మరమ్మత్తు పనులే కాకుండా కనీసం గ్రీజ్ నిర్వహణ కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసారని మంత్రి రామానాయుడు తెలిపారు. అందువల్లనే నీటి ప్రవాహానికి గేట్లు కొట్టుకుపోవడం, తుప్పు పట్టిన రోప్ లు తెగిపోవడం వంటివి జరుగుతున్నాయన్నారు. ఇటీవల వరద ఉధృతికి నక్కల కాలువ అవుట్ ఫాల్స్ స్లూయిస్ వద్ద తలుపు కొట్టుకుపోయిందని, ఈ పరిస్థితుల్లో వేరొక డోర్ తెచ్చి అమర్చడం జరిగిందన్నారు. దీనికి కొత్త తలుపు ఏర్పాటు కోసం అత్యవసరంగా పనిగా 50 లక్షలు నిధులు మంజూరు చేశామన్నారు. జగన్ గత ఐదేళ్లు మొద్దు నిద్ర చేసిన పాపం ప్రజలు అనుభవిస్తున్నారని మంత్రి రామానాయుడు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *