లీడర్ భాస్కర్ న్యూస్ (ఏలూరు)ఇటీవల దేవరపల్లి లో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు రైతులు వారి సమస్యలు చెప్పగా తక్షణం స్పందించిన ఎంపీ ఢిల్లీ లో కేంద్ర కామర్స్ మినిస్టర్ ను కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంట పై ఫెనాల్టీ రద్దు చేయాలని కోరారు. అందుగురించి కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు ఫెనాల్టీ రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది.ఈ సందర్బంగా జిల్లాలో పొగాకు పంట పండించిన రైతులు వందలాదిగా ఏలూరు వచ్చి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించారు.పొగాకు రైతు సంఘాల అద్యక్షులు పరిమి రాంబాబు, కరాటం రెడ్డి నాయుడు, కాకర్ల వివేకానంద లు మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి వలన జిల్లాలో ఉన్న 15 వేల మంది పొగాకు రైతులు 15 కోట్లు, రాష్ట్రం లో ఉన్న లక్ష మంది పొగాకు రైతులు 110 కోట్లు లబ్ది పొందామన్నారు. అలాగే ప్రతి సంవత్సరం దేశానికి 25 వేల కోట్లు నష్టం కలిగిస్తున్న నకిలీ సిగరెట్ల అక్రమ దిగుమతులను అరికట్టాలని కోరారు.