క్లీన్ తణుకు – గ్రీన్ తణుకులో అందరూ భాగస్వామ్యం కావాలి – తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…

* క్లీన్ తణుకు – గ్రీన్ తణుకు పోస్టర్ ఆవిష్కరించిన MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ  అధ్యక్షతన క్లీన్ తణుకు – గ్రీన్ తణుకు యొక్క పోస్టర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో పారిశుధ్యం ఏ విధంగా ఉంది అనేది ప్రజలు గుర్తు చేసుకోవాలని,దోమల సమస్య , డ్రైనేజి సిల్ట్ సమస్య , పారిశుధ్య నిర్వహణ ఇవన్నీ గుర్తు చేసుకోవాలని అటువంటి పరిస్థితి నుండి నేడు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని భవిష్యత్తు లో తణుకు ని క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా నిలుపుకోవాలని దానికి అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజలు , చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణంలో 180 మంది పారిశుధ్య సిబ్బంది రోజుకి సుమారు 40 మెట్రిక్ టన్నుకు చెత్తను సేకరిస్తున్నారని, డ్రైనేజిలలో సిల్ట్ తీస్తుంటే వాటి నిండా ప్లాస్టిక్ వస్తువులు ఉంటున్నాయని ఇటువంటి వాటికి ఇకపై చెక్ పెడుతూ పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇచ్చి పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చే దిశగా అడుగులు వెయ్యాలని కోరారు. వ్యాపారస్తులు చెత్తను అరికట్టేందుకు తగు సూచనలు ఇవ్వాలని,. ప్రతి ఇంటికి గ్రీన్ తణుకు – క్లీన్ తణుకు నినాదాన్ని తీసుకువెళ్ళి పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చేందుకు పట్టణ ప్రజలు సహకరించాలని MLA రాధాకృష్ణ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *