లీడర్ భాస్కర్ న్యూస్(తణుకు) తణుకు మండల పరిషత్ అభివృద్ది అధికారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీ (ట్రైనింగ్) శిక్షణ తరగతులను ప్రారంభించారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వందేమాతర గీతాలాపన చేసి కార్యక్రమాన్ని కొనసాగించారు. మూడు రోజులు పాటు ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని, గ్రామ పంచాయతీ విధులు బాధ్యతలు పారుశుధ్యం ఘన వ్యర్ధాల నిర్వహణ చెత్త సేకరణ తడి చెత్త – పొడి చెత్త వేరు చేయుట వర్మి కంపోస్ట్ తయారీ మార్కెటింగ్ స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీ చేయుట థీరియా టికల్ జి.పి.డి.పి. తయారీ విధానము , గ్రామ పంచాయితీలకు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాల ద్వారా ఆర్ధిక వనరుల లభ్యత, నిర్దేశించిన పోర్టల్ నందు గల యాక్టివిటీలు , 2024-25 జి.పి.డి.పి. ప్రణాళిక విశ్లేషణ, వీధి దీపాల ఏర్పాటు మరియు నిర్వహణ(LED) – ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం 1994 సెక్షన్ 80 మరియు 81 – CC చార్జీల చెల్లింపులు ప్రభుత్వ విధానం పై శిక్షణ కల్పించడం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో MLC వంక రవీంద్రనాధ్, మండలంలోని 9 గ్రామ పంచాయతీల సర్పంచ్ లు ,గ్రామ కార్యదర్శులు గ్రేడ్-1 నుండి గ్రేడ్ -5 , మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి . శ్రీలలిత,విస్తరణ అధికారి ఎ యస్ ఆర్ కోటేశ్వర రావు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తణుకు మండల అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ కృషి చేసి అగ్రభాగాన నిలపాలి – MPDO శ్రీలలిత
12
Aug