లీడర్ భాస్కర్ న్యూస్(తణుకు) వైసిపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్టపట్టించారని పశ్చిమగోదావరి జిల్లా తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. కనీసం పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. తణుకు పార్టీ కార్యాలయంలో విద్యా కమిటీ చైర్మన్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో పాఠశాలలకు ఎటువంటి సదుపాయాలు కల్పించలేదని చెప్పారు. పాఠశాలల పూర్వ వైభవానికి విద్యా కమిటీలు కృషి చేయాలని కోరారు. పాఠశాలలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడంతోపాటు పాఠశాలలలో మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేయాలని చెప్పారు. తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు వచ్చి చేస్తారని కాకుండా విద్యా కమిటీలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పాఠశాలల అభివృద్ధికి పనిచేయాలని పిలుపునిచ్చారు.
పాఠశాలల పూర్వ వైభవానికి విద్యా కమిటీలు కృషి చేయాలి – తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…
13
Aug