తణుకు జనసేన పార్టీ ఇంచార్జ్ పదవి ఎవ్వరిని వరించనుందో…? * తణుకులో jsp ఇంచార్జ్ పదవికి పెరుగుతున్న పోటీ..! *ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టిన సీనియర్ నాయకులు…

*టిక్కెట్ దక్కకపోవడంతో స్థబ్దతుగా ఉన్న ప్రస్తుత ఇంచార్జ్ విడివాడ…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

* స్థబ్దతుగా ఉన్న పాత ఇంచార్జ్ లను అధిష్టానం అక్కున చేర్చుకుంటుందా…?

* తణుకులో నూతన ఇంచార్జ్ నియామకం చేపట్టాలి అంటున్న jsp మండల అధ్యక్షులు…

* జనసేన ఇంచార్జ్ పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన సీనియర్ నాయకులు…

లీడర్ భాస్కర్ న్యూస్ ప్రతినిధి :- సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పాలనలో బిజీ, బిజీగా ఉంది. రాష్ట్రంలో మూడు పార్టీలు జతకట్టడంతో 175 నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఆయా పార్టీలకు చెందిన నాయకులు సీట్లు త్యాగాలు చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో  టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకుల మధ్యన సీటు దక్కించుకోవడంపై ఉత్కంఠ పోరు సాగింది. చివరికి టీడీపీ సీటు దక్కించుకుంది. 2014,2019, 2024 ఎన్నికల్లో తణుకులో జనసేన పార్టీ బలం ఎంత అన్నది పార్టీలకు తెలిసింది. 2019 లో సీటు ఆశించి బంగపడ్డ విడివాడ రామచంద్రరావు కొంత కాలానికి తణుకు  ఇంచార్జ్ గా నియమించబడ్డారు. 2024 పోటీలో మాత్రం కచ్చితంగా ఉంటారని జనసైనికులు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చిన క్రమంలో…. తణుకు సీటు టీడీపీకి కేటాయింపు జరిగింది. తమ అధినేత నిర్ణయమే శిరోధార్యం అని జనసైనికులు సరిపెట్టుకొని, కూటమి అభ్యర్థి గెలుపునకు కంకణం కట్టుకొని మరీ అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న ఆరిమిల్లి రాధాకృష్ణని గెలిపించారు. అయితే టిక్కెట్ ఆశించి బంగపడ్డ విడివాడ రామచంద్రరావు మాత్రం ఎన్నికల వేళ స్థబ్దతుగా ఉండిపోయారు. ప్రస్తుతం ఉన్న jsp మండల ఇంచార్జ్ లు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ కూడా ప్రయాణం చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. అయితే తమ పార్టీకి ఇక్కడ ఇంచార్జ్ లేకపోవడం లోటుగా భావిస్తున్న jsp మండల అధ్యక్షులు  కొత్త ఇంచార్జ్ నియామకం చేపట్టమని జిల్లా ఇంచార్జ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న మండల అధ్యక్షుల్లో ఒకరు ఆ బాధ్యతలు తనకు అప్పగిస్తే, బలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జిల్లా అధ్యక్షుడు దృష్టిలో పెట్టినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరో వైపు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకులు కూడా ఆ అవకాశం దక్కించుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారని, ఇప్పటికే కర్చీఫ్ వేయడానికి పావులు కదిపితే, jsp సీనియర్ నాయకులు అడ్డుకున్నారని సమాచారం. అయితే తణుకు ఇంచార్జ్ విషయంలో జనసేన పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానిపై ఇక్కడ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారింది..

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *