గ్రామాల అభివృద్ధిలో ఎంపీటీసీ, సర్పంచ్ లకు పూర్తి స్థాయిలో సహకారం అందజేస్తాం – తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ

లీడర్ భాస్కర్ న్యూస్ (ఇరగవరం) ఇరగవరం    మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఎంపీపీ కొప్పిశెట్టి అలివేలు మంగతయారు అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ  హాజరయ్యారు. ఈ సమావేశంలో శాఖల వారీగా సంబంధిత శాఖల అధికారులుతో మండలంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలకు సంబంధించి చర్చించారు. ఈ సందర్బంగా MLA  రాధాకృష్ణ  మాట్లాడుతూ గడచిన 3 సంవత్సరాల కాలంలో ఎంపీటీసీ, సర్పంచులకు ఏ విధమైన గుర్తింపు లేదన్నారు. గ్రామాల్లో అభివృద్ది  కొరవైందన్నారు. రాబోయే 2సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో ఎంపీటీసీ, సర్పంచులకు పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రతీ గ్రామంలో క్లీన్ & గ్రీన్ లా ఉండేలా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు.సెప్టెంబర్ మొదటి వారం నుంచి జరగబోయే రెవెన్యూ సదస్సులో  రైతులు ఎవరికైనా భూ సమస్యలు ఉంటే 45 రోజుల పరిధిలో పరిష్కరిస్తారని, ఈ అవకాశం ఇరగవరం మండల రైతులు ఉపయోగించుకోవాలన్నారు.గ్రామాల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ఆదేశాలుతో 15వ వార్షిక ఫైనాన్స్ నిధులను నేరుగా పంచాయతీలకు ఇచ్చి సర్పంచ్ లకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి వారికి అరుదైన గౌరవం ఇవ్వనున్నారని తెలియజేశారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *