లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) కీ.శే యలమర్తి నారాయణరావు చౌదరి 104 వ జయంతి సందర్భంగా తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పట్టణంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు కన్జ్యుమర్స్ సొసైటీ అధ్యక్షులుగా దాదాపు 38 సంవత్సరాలు తణుకు ప్రజలకు తలమానికంగా సేవలందించారని , విత్తన శుద్ధి కర్మాగారం ద్వారా నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించడం, నారాయణ వాటర్ ప్లాంట్ ద్వారా శుభ్రమైన నీటిని పట్టణ ప్రజలకు అందించడం లాంటి కార్యక్రమాలతో పాటు రాజకీయ వేత్తగా, వాణిజ్య వేత్తగా , సినిమా ఎగ్జిక్యుటీవ్ గా తనదైన ముద్రను వేసుకున్నారని అటువంటి వారి స్పూర్తితో ముందుకు సాగాలని అన్నారు.
కీ.శే యలమర్తి నారాయణరావు చౌదరి 104 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి…
14
Aug