లీడర్ భాస్కర్ న్యూస్ (అమరావతి) ఈడ్పుగల్లులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల ఐఐటి, మెడికల్ అకాడమీలో జంగారెడ్డిగూడెంకు చెందిన బందిల సూర్య తేజశ్రీ, రాజమండ్రికి చెందిన నత్తా ప్రదీప్తి ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సంస్క్కృతి, సాంప్రదాయాలపై అమెరికాలో ఏడాదిపాటు నిర్వహించే స్టడీ టూర్ కోసం యూత్ ఎక్స్చేంజి ప్రోగ్రామ్ కోసం వేలాదిమంది పోటీపడగా, దేశవ్యాప్తంగా కేవలం 30మంది మాత్రమే ఎంపికయ్యారు. అందులో రాష్ట్రం తరపున తేజశ్రీ, ప్రదీప్తి ఎంపికయ్యారు. పేద కుటుంబానికి చెందిన తమ కుమార్తెకు ఆర్ధిక సాయం అందించాలని నిన్న జరిగిన ప్రజా దర్బార్ లో తేజశ్రీ తల్లి మంత్రి లోకేష్ ని కోరారు. లోకేష్ సొంత ఖర్చులతో ఒక్కొకరికి లక్షరూపాయల ఆర్థిక సాయం, ల్యాప్ ట్యాప్ లను సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అందించారు.
ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదు – మంత్రి నారా లోకేష్
14
Aug