లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) ఎందరో త్యాగమూర్తుల ప్రాణ త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వతంత్రం అని మాజీ మంత్రి కారుమూరి తనయుడు, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరి సునీల్ కుమార్ అన్నారు. 78 వ స్వతంత్ర్య వేడుకలు పురస్కరించుకొని తణుకులో గల ysr cp కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ఇంకా బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆర్ధికంగా ఎదగాలన్నారు. యువత దేశ నాయకులను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలన్నారు.ప్రతి ఒక్కరూ ఒక ఆశయంతో పనిచేసి జీవితంలో ఎదగాలన్నారు. అనంతరం తణుకు నుండి స్వతంత్రం కోసం పోరాడిన నాయకుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఎందరో త్యాగమూర్తుల ప్రాణ త్యాగాల ఫలితమే మన దేశ స్వాతంత్ర్యం – కారుమూరి సునీల్ కుమార్ …
15
Aug