లీడర్ భాస్కర్ న్యూస్ (అత్తిలి) 78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అత్తిలి జనసేన పార్టీ కార్యాలయం నందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దేశ సరిహద్దుల్లో సేవలందించిన విశ్రాంత మిలటరీ ఆఫీసర్ జడ్డు మోహనరావు జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కలుషితం అయిపోయాయని, తిరిగి వ్యవస్థలన్నీ గాడిన పెట్టడం కోసం, ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం అందించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. జనసేన సీనియర్ నాయకులు, న్యాయవాది అనుకుల రమేష్ మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సాధించి పెట్టారన్నారు. నేతాజీ, భగసింగ్ లాంటి వారిని మనం చూడలేదని, అవన్నీ భావాలున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాల అనుగుణంగా పనిచేసి ప్రజలకు మంచి పరిపాలన చేరువ చేద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కాట్నం విశాలాక్షి, జిల్లా కార్యదర్శి అన్నెం విశ్వప్రభు, తిరుపతిపురం సర్పంచ్ కందుల లీల మణికంఠ, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పూతినీడి శ్రీనివాస్, సామన సత్తిబాబు,కాశీ క్షేత్రంలో విశేష సేవలందిస్తున్న రేలంగి వాస్తవ్యులు కొలా శ్రీనివాస్, వేమన సోమేశ్వర రావు, జనసైనికులు బడేటి త్రినాధ్, తానింకి అయ్యప్ప, గూడపాటి రాకేష్, బాధరాల శ్రీదర్, పైబోయిన శివ, సురేష్,పెరికల సుబ్బారావు, రాజు, ఆనంద్బో, బోయిన నాని, బడేటి శివ, తదితర జనసైనికులు..పుప్పాల కుమారి, పినిపే కావ్య, తదితర వీర మహిళలు పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.
అత్తిలిలో జనసేన పార్టీ కార్యాలయంలో స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు…
16
Aug