లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) కేరళలోని వాయనాడ్ లో భారీ వర్షాల వల్ల సంభవించిన ఆకస్మిక వరదలకు కొండచరియలు విరిగిపడడంతో సంభవించిన విలయానికి కలత చెంది, బాధితుల సహాయార్ధం తమ వంతు సహాయం గా తణుకు లోని హనీఫ్ పేట మసీదు తరుపున Dr. హుస్సైన్ అహ్మద్, ఇతర ముస్లిం మత పెద్దలు కేరళ సిఎం డిస్టరెస్ రిలీఫ్ ఫండ్ పేరున లక్ష రూపాయల చెక్కును తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధకృష్ణ కి అందచేశారు.కూటమి ప్రభుత్వం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన అన్న కాంటీన్ లకు విరాళంగా తణుకు పట్టణానికి కి చెందిన డాక్టర్ రిమ్మలపూడి సూర్యరాజు దంపతులు 50 వేల రూపాయలు, డాక్టర్ హుస్సేన్ అహ్మద్ 25 వేల రూపాయల చెక్కులను అన్న క్యాంటీన్ ట్రస్ట్ కి అందే విధంగా MLA రాధాకృష్ణకి అందజేయడంతో, వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ విధంగా దాతలు ముందుకు వచ్చి మరిన్ని విరాళాలు అందించాలని కోరారు.
అన్న క్యాంటీన్ కు విరాళాలు…. * దాతలను అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
16
Aug