లీడర్ భాస్కర్ న్యూస్ (అత్తిలి) అత్తిలి మండలం కె సముద్రపు గట్టు గ్రామానికి చెందిన చేబ్రోలు బసవయ్య అనే విద్యార్థి IIIT లక్నోలో MSc డేటా సైన్స్ చేయుటకు ఆర్ధిక సమస్య కారణంగా ఇటీవల ట్విట్టర్ ద్వారా మంత్రి నారా లోకేష్ ని సహాయం కోరడం జరిగింది. బసవయ్య ఆర్ధిక సమస్య ట్వీట్ ద్వారా గమనించిన మంత్రి లోకేష్ వెంటనే స్పందించి సహాయం కోరిన బసవయ్య కు నాలుగు సెమిస్టర్ లకు 4 లక్షల రూపాయలకు గాను మొదటి సెమిస్టర్ కు 1 లక్ష 16 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ ఆ మొత్తం చెక్ రూపంలో తనకి అందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ సహాయం కోరిన ప్రతి ఒక్కరికి లోకేష్ అండగా నిలుస్తున్నారని ప్రభుత్వం నుండి మాత్రమే కాకుండా స్వచ్చందంగా అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. బసవయ్యకి మిగిలిన సెమిస్టర్లకు కూడా సహకారాన్ని అందిస్తారని తెలిపి అతను ఉన్నత స్థానాలకు చేరుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.
మాట ఇచ్చిన మంత్రి లోకేష్ … చెక్కుని అందజేసిన MLA ఆరిమిల్లి….
18
Aug