లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) ఇటీవల పారిస్ లో జరిగిన 2024 ఒలింపిక్స్లో తణుకుకి చెందిన దండి శ్రీనివాసరావు కుమార్తె జ్యోతిక శ్రీ ….అథ్లెటిక్స్ 4*400 మీటర్స్ రిలే లో పాల్గొనడం ఎంతో సంతోషకరం అని తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా తణుకు క్యాంపు కార్యాలయంలో జ్యోతిక శ్రీ ని సంత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో విజయాలను సాధించి ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళడం అభినందనీయం అన్నారు. స్టేట్ లెవెల్, నేషనల్ లెవల్ , ఇంటర్నేషనల్ లెవెల్ లో ఎన్నో విజయాలను సాధించిన జ్యోతిక శ్రీ భవిష్యత్తులో మరింతగా రాణించాలని దానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి సహకరిస్తామన్నారు. జ్యోతికశ్రీ ని స్పూర్తిగా తీసుకుని యువత రాణించాలని పేర్కొన్నారు.
క్రీడాకారిణి జ్యోతికశ్రీ కి మరింత సహకారం అందజేస్తాం – MLA ఆరిమిల్లి రాధాకృష్ణ
18
Aug