లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు ) శ్రీ శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి పురస్కరించుకుని తణుకు పట్టణం కొమ్మాయి చెరువు గట్టు గణపతి గౌడ సేవా సంఘం వారు పాపన్న గౌడ్ విగ్రహం వద్ద పూలదండలు వేసి జయంతి కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా తణుకు పట్టణం నందు గౌడ పెద్దలు అందరూ కలిసి ఆయనకు విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం వారి యొక్క జీవిత చరిత్రను గుర్తు చేసుకున్నారు. పలువురు మాట్లాడుతూ నేటి యువత ఆదర్శంగా తీసుకుని గౌడ కుల ఐక్యతతో పాటు, భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థానాలకి ఎదగాలన్నారు . ఈ కార్యక్రమంలో గౌడ్ పెద్దలు కామన మునిస్వామి , మట్టా వెంకట్ , కోట నాగేశ్వరరావు బ్రదర్స్ ,వెలగన వాసు, రాజులపాటి శ్రీనివాస్ , కొండేటి శ్రీనివాస్ గారు రేలంగి శ్రీనివాస్ గారు కట్ట రాజేష్ కొండయ్య , కట్టా సతీష్ , రాచమల్ల రామకృష్ణ , గౌడ పెద్దలు పాల్గొన్నారు.
తణుకులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి …
18
Aug