లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు గొప్ప వరంగా భావించే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన బోడపాటి నాగ సునీతాకి రూ. 1,47,725/- అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామానికి చెందిన అల్లం దేవి నాగ రేవతికి రూ. 1,00,000/- విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తణుకు MLA ఆరిమిల్లి రాధాకృష్ణ సిఫార్సు మేరకు ముందుగా అనుమతి తీసుకొని వైద్యం చేయించుకొనుటకు ఆసుపత్రికి మంజూరు కాబడిన ఉత్తర్వులను LOC ( Letter Of Credit ) లబ్దిదారులకు తణుకు క్యాంపు కార్యాలయములో MLA రాధాకృష్ణ అందజేశారు. జరగాల్సిన వైద్యం కోసం చూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వారి కుటుంబానికి చేయూతగా నిలవడంతో MLA కి కృతజ్ఞతలు తెలియజేశారు.
సిఎం సహాయనిధి LOC ఉత్తర్వులు అందజేసిన MLA ఆరిమిల్లి రాధాకృష్ణ…
18
Aug