లీడర్ భాస్కర్ న్యూస్ (విశాఖపట్నం) అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, స్థానిక ఎంపీ శ్రీభరత్, ఉత్తర ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, భాజపా నేత మాధవ్ ఇతర నేతలు, అధికారులతో కలిసి సోమవారం సాయంత్రం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారిలో మనోధైర్యం నింపారు.ఆమె వెంట జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, కేజీహెచ్ సూపరెంటెండెంట్ కె. శివానంద, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ఇతర అధికారులు ఉన్నారు.
అస్వస్థతకు గురైన చిన్నారులను పరామర్శించిన హోమంత్రి అనిత…
20
Aug