లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) SC, ST రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా బహుజన సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తణుకు పట్టణంలో మాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగు భారత్ బంద్ కు పట్టణంలోనీ అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, వాణిజ్య వ్యాపార సంస్థలు, హోటల్స్, రవాణా సంస్థలు సహకరించాలని మాల ఐక్య వేదిక (MIV) జాతీయ అధ్యక్షులు తిర్రే రవిదేవా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తేతలి అంబెడ్కర్ భవనంలో కేసరపల్లి వెంకట్రావు అధ్యక్షుతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో bsp నాయకుడు వెన్నపు సుధాకర్, దళిత నాయకుడు మోలుం మైఖేల్, మాల ఐక్య వేదిక నాయకుడు మర్రి నవీన్, బద్దె కిరణ్, మద్దిల యేసు, నెలపాటి రేవంత్ తదితరులు పాల్గొన్నారు.
21వ తేదీ భారత్ బంద్ కి సహకరించండి…. – మాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు తిర్రే రవిదేవా..
20
Aug