లీడర్ భాస్కర్ న్యూస్ (అత్తిలి)మంగళవారం స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహముల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుచున్న సౌకర్యాలు భోజన వసతులు పై ఆరా తీశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జిల్లా కలెక్టర్ సమాధానాలను రాబట్టారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనాన్ని రుచి చూశారు. భోజనం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విద్యార్థినులు విద్యార్థి దశ నుండే మంచిగా చదువుకుంటే భవిష్యత్తు గొప్పగా ఉంటుందన్నారు. అప్పుడే మీ కలలు సాకారం అవుతాయని అన్నారు. అన్ని విషయాలపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉన్నప్పుడే చదువులో మరింత రాణించగలరని అన్నారు. చదువుతోపాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మంచి ఆరోగ్యం శరీర దారుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. వసతి గృహముల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని తన దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కరిస్తానని విద్యార్థులతో అన్నారు. విద్యార్థులు రూములను వారి ఉపయోగించే టాయిలెట్స్ ను కలెక్టర్ నేరుగా వెళ్లి పరిశీలించారు. విద్యార్థినులకు భోజన సదుపాయాల్లో ఎటువంటి లోపం లేకుండా నాణ్యత పాటించాలని వారంలో మెనూ ప్రకారం ఆహార అందించాలని వసతి గృహముల అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని మంచి భవిష్యత్తును పొందాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకాంక్షించారు.వసతి గృహం తనిఖీ సందర్భంలో అత్తిలి తాహాసిల్దార్ డి.వంశీ సుబ్రహ్మణ్యేశ్వర్, ఎంపీడీవో అమీర్ జమ, ఏవో వీవీఎస్ రమణారావు, హెచ్ డబ్ల్యు ఓ ఆర్ జెడి లక్ష్మి, తదితరులు ఉన్నారు.
బాలికల వసతి గృహన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి….
21
Aug