లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) నాలుగు చక్రాల బండ్లపై మిక్చర్,బజ్జీ,పానీపూరి లాంటివి అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్న వీధి విక్రయదారుల సంక్షేమానికి తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తమ వంతు సహకారం అందించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు కోరారు. సంచార నాలుగు చక్రాల బండ్ల మిక్చర్, పానీపూరి వర్తక సంఘం సభ్యులు బుధవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ వీధి విక్రయదారుల ఉపాధికి భద్రత కల్పించాలని, సబ్సిడీపై రుణాలు ఇప్పించాలని వీధి విక్రయదారుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.అనంతరం సంఘ సభ్యులు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేతులు మీదుగా సంఘ గుర్తింపు కార్డులు అందుకున్నారు.