కలకత్తా ఘటనలో నిందితులను వెంటనే శిక్షించాలంటూ CITU ఆధ్వర్యంలో నిరసన…

లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు) కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య చేసిన నిందుతులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక నరేంద్ర సెంటర్ లో CITU ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ పైన అత్యాచారం, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, మహిళలకు, డాక్టర్లకు రక్షణ కల్పించాలని, మహిళలకు రక్షణకు కట్టుదిట్టమైన చట్టాలు ప్రభుత్వాలు తేవాలని పెద్దత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ప్రతాప్ మాట్లాడుతూ… దేశంలో ప్రతీరోజు ఏదోపక్కన పసిపిల్లలు దగ్గరనుండి పండు ముసలి వరకు అత్యాచారం, హత్యలు జరగడం బాధాకరం అన్నారు. నేటి ప్రపంచంలో మహిళలు జీవనోపాధి కోసం రాష్ట్రాలు, దేశాలు వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడం అంటే కేవలం ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వడం, అరెస్టు లు చేయడం కాదని విమర్శించారు. ఒక్కసారి జరిగిన సంఘటన మళ్ళీ జరగకుండా గట్టి చర్యలు చేపట్ట వలసిన బాధ్యత ప్రభుత్వాలుదే నని అన్నారు. జూనియర్ డాక్టర్ పైన హత్య చేసిన నిద్దుతులని పట్టుకోవడంలో బెంగాల్, కేంద్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని అన్నారు. ఈ ఘటనను సుప్రీం కోర్టు ఈ కేసుని సుమోటా తీసుకొన్నదని అన్నారు. వెంటనే నిండుతులని పట్టుకొని కఠినంగా శిక్షించాలని, మళ్ళీ ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని ప్రతాప్ హెచ్చరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *