సీఎం జిల్లా పర్యటన విజయవంతం చేయండి – జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్


లీడర్ భాస్కర్ న్యూస్ (అమలాపురం) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభలలో పాల్గొనడానికి ఈనెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని కొత్తపేట మండలం వానపల్లి గ్రామానికి రానున్నారని.. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి పర్యటన లో భాగంగా చేయాల్సిన ఏర్పాట్లపై అమలాపురం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 23న గ్రామ సభలు నిర్వహిస్తున్నారని .. ఆ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి పంచాయతీలోని గ్రామసభలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు అన్నారు. అధికారులంతా సమిష్టిగా పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. దీనికి సంబంధించి ఏఎస్ యల్ ను ఆగస్టు 22 మధ్యాహ్నం నిర్వహిస్తామని తెలిపారు.
అంతకుముందు కలెక్టర్ వానపల్లి గ్రామాన్ని సందర్శించి సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిషాంతి, డిఆర్ఓఎం వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఏ పి డి డాక్టర్ శివ శంకర ప్రసాద్, సిపిఓ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈ చంటిబాబు, డి ఎం హెచ్ ఓ దుర్గారావు దొర ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *