అచ్యుతాపురం ఫార్మాకంపెనీలో మృతుల కుటుంబాలకు 1కోటి పరిహారం ఇవ్వాలి – మాజీ సీఎం జగన్

లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లి) అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మాకంపెనీలో రియాక్టర్‌ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలి. వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలి. తన పార్టీ నాయకులతో కూడిన బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుంది. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటివి జరక్కుండా గట్టి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *