లీడర్ భాస్కర్ న్యూస్ (మండపేట) ఇటీవల అనారోగ్యంతో మరణించిన మండపేట మండలం ఇప్పనపాడు గ్రామ పీఎంపీ సభ్యుడు శేశెట్టి రామకృష్ణ కుటుంబానికి గురువారం కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ది పీఎంపీ అసోసియేషన్) జిల్లా అధ్యక్షులు కోన సత్యనారాయణ సారధ్యంలో సభ్యుల సహాకారంతో 30’000/-(ముప్పై వేల రూపాయలు) ఆర్ధిక సహకారం అందచేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తోరాటి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రధమ చికిత్సలందించే పీఎంపీలకు సంఘం అనేది వృత్తి పరిరక్షణకు ఒక భరోస అందించడమని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా కూడా సహాయ సహకారాలు అందించేందుకు సభ్యులు ఐకమత్యమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో బీవీ రమణ,వీకే రాజు,ఇరవాడ రవి, వెంకటేశ్వరరావు, ఎమ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.కోన సత్యనారాయణ మాట్లాడుతూ సహాయ సహకారాలు అందించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
పీఎంపీ కుటుంబానికి చేయూత…
22
Aug