లీడర్ భాస్కర్ న్యూస్ (మండపేట) గోదావరి జిల్లాల్లో నిత్యం కనిపించే ఘటనలతో సందేశాత్మక చిత్రం కమిటీ కుర్రోళ్ళు నిర్మించానని మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారిక పేర్కొన్నారు.ఇటీవల విడుదలైన చిన్న చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం యూనిట్ మండపేట లో సందడి చేసింది. విజయోత్సవ యాత్ర లో భాగంగా చిత్ర దర్శకుడు యధు వంశీ, నిర్మాత మెగా ప్రిన్సెస్ నిహారిక తో పాటు చిత్రం లో హీరోలుగా నటించిన 11 మంది కొత్త కుర్రోళ్ళు ఈ సినిమా ప్రదర్శిస్తున్న సప్తగిరి ధియేటర్ కు గురువారం విచ్చేసారు. ఈ సందర్భంగా నీహారిక మాట్లాడుతూ చిత్రాన్ని ఇంతగా విజయవంతం చేసిన ప్రేక్షకుల ఆదరాభిమానాలు మరువలేనివి అన్నారు. దర్శకుడు వంశీ మాట్లాడుతూ తాను ఎంతో భావోద్వేగంతో రాసుకున్న ఈ కథ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా వుందన్నారు. రిజర్వేషన్ లు కోసం తాను వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చిన్నపాటి కథను రాసుకున్నానని పేర్కొన్నారు. తనకు కాంట్రవర్సీ చేసే ఉద్దేశ్యం ఎంతమాత్రం లేదని పేర్కొన్నారు.కథకు అవసరం కావడంతోనే సున్నితంగా ఈ అంశాన్ని ఎత్తుకున్నట్లు చెప్పారు. యూనిట్ సభ్యులను సప్తగిరి ధియేటర్ యాజమాన్యం మల్లిపూడి గణేష్, ముత్యాల రామకృష్ణ లు దుశ్శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ధియేటర్ మేనేజర్ ఆకుల సుందరం, మల్లేశ్వరరావు, మెగా ఫ్యామిలీ యువత అధ్యక్షులు కొంతం నాగేంద్ర ప్రసాద్, మామిడాల మనోకృష్ణ, మోరం బాలాజీ, శెట్టి రవి తదితరులు పాల్గొన్నారు.
కమిటీ కుర్రాళ్ళు సందేశాత్మక చిత్రం… ఆదరాభిమానాలు మరువలేనివి – నిహారిక…
22
Aug