లీడర్ భాస్కర్ న్యూస్ (విశాఖపట్నం) అచ్చుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో క్షతగాత్రులను విశాఖ ఆసుపత్రిలో సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలన్నారు. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయడిన వారికి రూ. 25 లక్షలు చొప్పున ఇస్తున్నామని చెప్పారు . భవిష్యత్ లోను బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
అచ్యుతాపురం ఫార్మా కంపెనీ క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు…
23
Aug