పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి…

లీడర్ భాస్కర్ న్యూస్ (తాడేపల్లిగూడెం)పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎఐటియుసి తాడేపల్లిగూడెం ఏరియా కమిటీ ఆద్వర్యంలో ప్రాంతీయ పంచాయతీ వర్కర్స్ యూనియన్ కార్మికులు శనివారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను ఆయన నివాసంలో , తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జీని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రాలను అందచేయడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం తమవంతు కృషి చేస్తామని, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని నాయకులు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని సుమారు నలభై గ్రామాల నుండి పంచాయతీ కార్మికులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. AITUC నాయకులు డి.సోమసుందర్ , ఓ వి రాజు , మందలపర్తి హరీష్, కళింగ లక్ష్మణరావు, తాడికొండ శ్రీనివాసరావు, తదితరులు నాయకత్వం వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *