లీడర్ భాస్కర్ న్యూస్ (తణుకు)తరచూ ఫార్మా కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాలు యాజమాన్యాల నిర్లక్ష్య ఫలితమేనని,ఫ్యాక్టరీల్లో భద్రతా పరమైన లోపాలను అరికట్టి కార్మికుల ప్రాణాలు కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.ఆదివారం తణుకు వీరనారాయణ సెంటర్లో భగత్ సింగ్ విగ్రహం వద్ద సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఫార్మా కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాల్లో యాజమాన్యాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.ధర్నా నుద్దేశించి భీమారావు మాట్లాడుతూ అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది,పరవాడ ఫార్మాసిటీ కంపెనీలో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. ప్రమాదాలకు ప్రధాన కారణం కంపెనీల యాజమాన్యాలు భద్రతాపరమైన చర్యలు తీసుకోక పోవడమేనన్నారు.యాజమాన్యాల నిర్లక్ష్యంగా కారణంగా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.భద్రతా పరమైన చర్యలు తీసుకోని కంపెనీ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు.కార్మికుల మరణాలను యాజమాన్యాలు హత్యలుగా పరిగణించాలని వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.చనిపోయిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించిన ప్రభుత్వం తక్షణమే కార్మిక కుటుంబాలకు చెల్లించాలని కోరారు.అలాగే పరవాడ ఫార్మా కంపెనీలో కార్మిక కుటుంబానికి కూడా కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని కోరారు.భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.