లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం)స్త్రీనిధి రుణాల చెల్లింపులకు నగదు రహిత లావాదేవీలను పెంపొందించే దిశగా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరము నందు స్త్రీనిధి ఋణాల రికవరీ నిమిత్తం 60 పేటీఎం మిషన్లను సి.సి లకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీనిధి బ్యాంక్ రోజురోజుకు ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. స్త్రీనిధి రుణాలు మంజూరు క్రింద ఆర్ధిక సంవత్సరం 120 కోట్లు లక్ష్యం కాగా, నేటి వరకు 6,249 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు 50 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేసి మహిళల జీవనోపాధితోపాటు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. 99 శాతం లోన్ రీ పేమెంట్ నమోదు కావడం ఎంతో గొప్ప విషయం అన్నారు. గ్రామ సంఘం సమావేశాలు ఏర్పాటు చేసి రుణ వాయిదాలను స్త్రీ నిధి బ్యాంక్ కు జమ కావడంలో జాప్యాన్ని నివారించేందుకు నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు చర్యల్లో భాగంగా పేటియం మిషన్లను అందజేయడం జరిగిందని తెలిపారు.
స్త్రీనిధి రుణాల చెల్లింపులకు నగదు రహిత లావాదేవీలను పెంపొందించే దిశగా చర్యలు – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
26
Aug