టీ తాగారా… అంటూ మంత్రి రామానాయుడు ఆప్యాయత పలకరింపులు…

లీడర్ భాస్కర్ న్యూస్ (పాలకొల్లు) టీ తాగారా అంటూ ప్రతి ఒక్కరిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆప్యాయంగా పలకరించారు. పాలకొల్లులోని ఆయన కార్యాలయానికి సమస్యలపై వచ్చే ప్రజలకు, కలిసేందుకు వచ్చిన అధికారులు, ఉద్యోగులు, కూటమి పార్టీ శ్రేణులకు ఇలా ప్రతి ఒక్కరికి టీ అందించే సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరిని ముందుగా టీ తాగారా అంటూ పలకరిస్తూ సమస్యలను ఆలకిస్తున్నారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కర దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి నిజాయితీగా సిఫార్సు లేఖలను ఇస్తున్నారు. మరోపక్క ఫోన్లో వివిధ శాఖల అభివృద్ధి పనుల ప్రగతిని సంబంధిత అధికారుల నుంచి ఆరా తీస్తున్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *