లీడర్ భాస్కర్ న్యూస్ (భీమవరం) అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్ల సొమ్ము చెల్లించి న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు, సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు.భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులుకు అసోసియేషన్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.సోమవారం భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ పదిన్నర లక్షల మంది బాధితులకు 3080 కోట్ల రూపాయలు చెల్లించ వలసి వుందన్నారు.అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్ పి వి) ఏర్పాటు చేయాలని, అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీసంరక్షించుటకు చర్యలు తీసుకోవాలని, బినామీల పేరుతో అగ్రిగోల్డ్ యజమానులు దాచుకున్న భూములు, ఆస్థులు స్వాధీనం చేసుకోవాలని కోరారు.మరణించిన బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో చెల్లిచి న్యాయం చేయాలని కోరారు.అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం బ్రాంచి గౌరవాధ్యక్షులు ఎం.సీతారాం ప్రసాద్, అధ్యక్షుడు కె.గోపాలకృష్ణ పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్ల సొమ్ము చెల్లించి న్యాయం చేయాలని కోరుతూ భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుకు వినతి…
26
Aug